APPALAYAGUNTA PAVITROTSAVAMS OFF TO A GRAND START_ వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం – Sri Prasanna Venkateswara Swamy Temple
Tirupati, 5 October 2018: The annual Pavitrotsavams in Appalayagunta off to a ceremonial start with Pavitra Pratishta on a Friday ( 05/10/2018).
After morning rituals, snapana tirumanjanam was performed to the processional deities of Sri Prasanna Venkateswara Swamy flanked by Sridevi and Bhudevi on either sides.
Later the specially made Pavitra garland were brought to Yagashala and special pujas were performed.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2018 అక్టోబరు 05: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమలసేవ, అర్చన, అభిషేకం నిర్వహించారు. ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉదమం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. సాయంత్రం 6.45 నుండి రాత్రి 9.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించన్నారు.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీశ్రీనివాసరాజు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Leave A Comment