శ్రీవారి కలియుగ దైవంగా పూజలందుకుంటున్న తిరుమల ప్రాంతం ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా ప్రకృతి రమణీయతకు కూడా ప్రసిద్ధి. ఇక్కడి సుందరమైన ప్రదేశాల్లో శిలాతోరణం ఒక ప్రత్యేకతగా నిలుస్తుంది. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాతి శిలతోరణం, తిరుమల పర్వతాల్లో వుండి భక్తుల్ని, పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. తిరుమల శేషాచలం అడవుల్లో ఉన్న ఈ శిలతోరణం అనేది లక్షల సంవత్సరాల క్రితం పర్వతాల నిర్మాణం సందర్భంగా ఏర్పడినదని భౌగోళిక శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇది రెండు పెద్ద శిలల మధ్య ఉన్న […]