అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 14న గరుడ వాహనం, 15న పుష్పకవిమానం, అక్టోబరు 17న స్వర్ణరథం, 18న చక్రస్నానం తిరుమల ;శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. […]