ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం వచ్చే హిందూ దేవాలయంగా ఆంధ్రప్రదేశ్లోని ‘తిరుమల తిరుపతి దేవస్థానం’కు గుర్తింపు ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రానికి దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా తిరుమల క్షేత్రం విరాజిల్లుతోంది. నిత్యం వేలాది మంది భక్తులతో ఏడుకొండలు సందడిగా కనిపిస్తాయి. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుంచి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా […]